Movie news

Latest Tollywood News


Mahesh Dookudu 100 days centers


Mahesh Dookudu 100 days centers Super Star Mahesh Babu’s latest super hit Dookudu is going to complete its successful 100 days run in 37 direct centers in Andhra Pradesh on December 31. The makers are.....................
Read more

ప్రొడక్షన్ రంగంలోకి మహేష్ బాబు?


మహేష్ బాబు చిత్రనిర్మాణంలోకి దిగుతున్నాడా? ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ గా డిస్కషన్స్ లో వున్న టాపిక్ ఇదే. మహేష్, నమ్రత దంపతులు త్వరలోనే చిత్ర నిర్మాణంలోకి ప్రవేశిస్తున్నారనీ, అందుకోసం ఓ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభిస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే, ముందుగా తెలుగులో కాకుండా బాలీవుడ్ లో చిత్రనిర్మాణం చేబట్టాలని యోచిస్తున్నారట. తొలి ప్రయత్నంగా మహేష్ బాబుని హిందీలో లాంచ్ చేయాలని నమ్రత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లాంచింగ్ గ్రాండ్ గా వుండాలని ఆమె ప్లాన్ చేస్తోందట. ఇందుకోసం బాలీవుడ్ లో తనకున్న పూర్వ పరిచయాలను ఉపయోగించుకోనుంది. బహుశా 'బిజినెస్ మేన్' చిత్రాన్ని తమ తొలి చిత్రంగా హిందీలో రీమేక్ చేయచ్చని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికావచ్చు


'గబ్బర్ సింగ్' పొల్లాచ్చి షెడ్యూలు పూర్తి

'గబ్బర్ సింగ్' పొల్లాచ్చి నుంచి హైదరాబాదుకి తిరుగు ప్రయాణం అయ్యాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగు ముగిసింది. డిసెంబర్ రెండు నుంచి పొల్లాచ్చి పరిసరాల్లో ఈ సినిమా షూటింగు జరిగింది. పవన్, శృతి హాసన్ లతో బాటు మరి కొందరు ప్రధాన తారాగణం కూడా ఈ షూటింగులో పాల్గొన్నారు. ఇదిలా ఉంచితే, ఈ చిత్రంలో విలన్ పాత్రకు మొదట్లో ఎంపికైన సోనూసూద్ తప్పుకోవడంతో ఆ స్థానంలో 'రక్తచరిత్ర' ఫేం అభిమన్యు సింగ్ చేరాడు. 
       'రక్తచరిత్ర'లో తన నటన నచ్చడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ తన ఫొటోలను పవన్ కల్యాణ్ కి చూపించారనీ, ఆయన ఇంప్రెస్ అయి, ఓకే చెప్పడంతో ఈ సినిమాలోకి వచ్చాననీ అభిమన్యు చెబుతున్నాడు. ఈ చిత్రం షూటింగు హైదరాబాదు, పొల్లాచ్చితో బాటు మహారాష్ట్రలోని పంచగని ప్రాంతంలో కూడా చేస్తున్నారు. 'దబాంగ్' ఒరిజినల్ లో సల్మాన్ నటించిన మార్కెట్ సీన్స్ పంచిగనీలోనే చిత్రీకరించారు. ఇందులో శృతి హాసన్ గ్రామీణ యువతిగా నటిస్తోంది.


ఇలియానా 'స్నేహితుడు'గా విజయ్

 'రోబో' సినిమా తర్వాత తమిళ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న 'నన్బన్' చిత్రాన్ని తెలుగులోకి 'స్నేహితుడు' పేరుతో అనువదిస్తున్నారు. హిందీ హిట్ సినిమా 'త్రీ ఇడియట్స్' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో తమిళ్ స్టార్ విజయ్, ఇలియానా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ ఆడియో వేడుక శుక్రవారం రాత్రి కోయంబత్తూర్లోని హిందూస్థాన్ కాలేజ్ లో ఘనంగా జరిగింది. తమిళంలో దీనిని జెమినీ ఫిలిం సర్క్యూట్స్ సంస్థ నిర్మించగా, తెలుగు అనువాద హక్కుల్ని దిల్ రాజు పొందారు. మొదట్లో తెలుగు వెర్షన్ కి 'త్రీ రాస్కేల్స్' టైటిల్ అనుకున్నప్పటికీ, తాజాగా 'స్నేహితుడు' పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తెలుగు పాటలను జనవరి మొదటి వారంలోనూ, చిత్రాన్ని జనవరి 26 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హేరిస్ జై రాజ్ ఈ చిత్రానికి సంగీత బాణీలు కట్టారు. 





సూపర్ హిట్ ప్రేమ కథా చిత్రానికి సీక్వెల్

1990 లో వచ్చిన బాలీవుడ్ సినిమా 'ఆషికి' చక్కని సంగీతభరిత ప్రేమకథా చిత్రంగా పేరు తెచ్చుకుంది. మహేష్ భట్ దర్శకత్వంలో టీ సీరీస్ అదినేత గుల్షన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. రాహుల్ రాయ్, అనూ అగర్వాల్ వంటి తారలను ఈ చిత్రం వెండితెరకు పరిచయం చేసింది. అనూరాధా పౌడ్వాల్, కుమార్ సానూ వంటి గాయకులను వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ నిర్మించే పనిలో దర్శకుడు మహేష్ భట్ బిజీగా వున్నాడు.
      అయితే, ఈసారి దర్శకత్వ బాధ్యతల్ని తాను చేబట్టకూడదనీ, ఆ అవకాశం ఓ యువకుడికి ఇవ్వాలనీ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఎంతో మందిని పరిశీలించిన మీదట తన కుటుంబానికే చెందిన మోహిత్ సూరీ కి ఈ బాధ్యతలు అప్పజెప్పాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల వచ్చిన 'మర్డర్-2' చిత్రానికి మోహిత్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు 'ఆషికి-2' చిత్రానికి కూడా అప్పటిలానే కొత్త హీరో హీరోయిన్లను తీసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం స్టార్ హంట్ ను కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

రామ్ చరణ్ 'రచ్చ'లో రవిబాబు కామెడీ

ప్రముఖ నటుడు చలపతిరావు తనయుడు రవిబాబు అటు ఆర్టిస్టుగానూ, ఇటు డైరెక్టర్ గానూ కూడా తన టాలెంట్ ప్రదర్శిస్తున్నాడు. వృత్తిపరంగా దర్శకుడిగానే ఎక్కువగా దృష్టి పెడుతున్నప్పటికీ, అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్లు వస్తే నటుడిగా కూడా తన తడాఖా చూపిస్తూనే వున్నాడు. అలాగే, తాజాగా రామ్ చరణ్ తేజా నటిస్తున్న 'రచ్చ' సినిమాలో కూడా రవిబాబు నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ వెరైటీ కామెడీ పాత్ర ఉండడంతో, దర్శకుడు సంపత్ నంది దానిని రవిబాబు చేత వేయించాలని అడిగాడట. తనకు కూడా అ పాత్ర నచ్చడంతో రవిబాబు ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. రామ్ చరణ్ ఇందులో మెడికల్ స్టూడెంట్ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అతని సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగు ఇప్పటికి అరవై శాతం వరకు పూర్తయిందట. మార్చిలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

ఆర్య, అనుష్క జంటగా ద్విభాషా చిత్రం

స్వీటీ అనుష్క తాజాగా ఓ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆర్య, అనుష్క జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగు ఈ రోజు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇటీవలే విక్రమ్, దీక్షా సేత్ జంటగా 'వీడింతే' చిత్రాన్ని నిర్మించిన పి.వి.పి. సినిమా సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఉన్నత సాంకేతిక విలువలతో, అన్ని కమర్షియల్ అంశాలతోనూ దీనిని నిర్మిస్తున్నామని నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్ చెప్పారు. ఈ కథకు ఆర్య, అనుష్క నూటికి నూరు శాతం సరిపోతారని అన్నారాయన. దీనికి హ్యారిస్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

3D ఫార్మేట్లో రవితేజా సినిమా


తెలుగు హీరో రవితేజ, తమిళ హీరో సూర్య కలిసి తొలిసారిగా ఓ చిత్రంలో నటిస్తున్న విషయం మనకు తెలుసు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాను సాంకేతికంగా హిందీ సినిమా 'రా. వన్' ను మించిన స్థాయిలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రం గురించి దర్శకుడు వెంకట్ ప్రభు చెబుతూ, "రా.వన్ సినిమా కోసం ఆయా సీన్స్ ను ముందుగా డిజిటల్ ఫార్మేట్లో షూట్ చేసి, ఆ తర్వాత 3D ఫార్మేట్లోకి ట్రాన్స్ ఫేర్ చేయడం జరిగింది. అయితే, ఇప్పుడీ చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని డైరెక్ట్ గా 3D ఫార్మేట్లోనే షూట్ చేయనున్నాం. దీని కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ను కాంటాక్ట్ చేస్తున్నాం" అన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించే ఈ చిత్రాన్ని వచ్చే జూన్ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తారు.

ఇది సునీల్ కామెడీ కాదండోయ్!

హాస్యనటుడు సునీల్ హీరోలతో పోటీపడుతున్నాడు. ఇప్పటికే డ్యాన్సుల్లో పోటీపడిన సునీల్ తాజాగా బాడీ బిల్డప్ లో కూడా పోటీ ఇస్తున్నాడు. అందరూ చేయలేని సిక్స్ ప్యాక్ బాడీ బిల్డప్ చేశాడు. తాజాగా తను నటిస్తున్న 'పూలరంగడు' సినిమాలో ఆ బాడీతో ప్రేక్షకులను అలరిస్తాడట. యాక్షన్ దృశ్యాలలో షర్ట్ విప్పి తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించనున్నాడు. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు. 'ఆ సందర్భంగా తీసిన ఫొటో అంటూ' ఒకటి తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ ఫొటోనే! ఇషాచావ్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె. అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.


'గబ్బర్ సింగ్' ని 'కోటి' అడుగుతున్న బిపాషా

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'దబాంగ్' రీమేక్ 'గబ్బర్ సింగ్' సినిమాలో మున్నీ ఐటెం సాంగ్ ఎవరు చేస్తారన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. హిందీ ఒరిజినల్ లో మలైకా అరోరా చేయగా, తమిళ రీమేక్ లో మల్లికా షెరావత్ చేసింది. అందుకే తెలుగులో కూడా బాలీవుడ్ భామనే పెట్టాలని నిర్మాతలు ట్రై చేస్తున్నారు. తాజాగా ఇందుకోసం బిపాషా బసుని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ పాటకు నిర్మాత ఆమెకు 50 లక్షల వరకు ఆఫర్ చేశాడట. అయితే, బిప్స్ మాత్రం కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయినా నిర్మాతలు మరో మాట చెప్పమని ఆమెను అడుగుతున్నట్టు బాలీవుడ్ సమాచారం. సాటి హీరోయిన్లు కత్రినా కైఫ్, కరీనా కపూర్ వంటి తారలు చేస్తున్నట్టుగా తను కూడా ఇకపై ఐటెం నంబర్స్ చేయాలని బిప్స్ డిసైడ్ చేసుకుందట. మరి, ఇంతకీ 'గబ్బర్ సింగ్' లో చేస్తుందా? లేదా? అన్నది మన వాళ్లు ఇచ్చే రేటుని బట్టి వుంటుంది!




రానా దగ్గుబాటి కూడా ఆ కోవలో చేరిపోయాడు

 ఈమధ్య మన తారలు చాలా మంది వాణిజ్య ప్రకటనలకు పనిచేస్తూ, కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న సంగతి మనకు తెలిసిందే. సినిమాల ద్వారా సంపాదించుకున్న ఇమేజ్ ని ఆ విధంగా వాడుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. మహేష్ బాబు, యన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల చేతుల్లో ఇప్పుడు చాలా ప్రాడక్ట్స్ వున్నాయి.  ఇప్పుడీ కోవలోకి మరో హీరో రానా దగ్గుబాటి కూడా చేరిపోయాడు. తొలిసారిగా రాయల్ స్టేగ్ బ్రాండ్ పానీయాలకు ప్రచారకర్తగా సంతకం చేశాడు. తెలుగు, హిందీ చిత్ర రంగంలో రానాకున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీ అతనిని తమ బ్రాండ్ అంబాసడార్ గా ఎంచుకుంది. ఇందుకు సంబంధించిన అడ్వెర్ టైజ్మెంట్ షూటింగులో ఇటీవలే రానా పాల్గొన్నాడు. త్వరలో ఈ కమర్షియల్స్ ప్రసారం అవుతాయి.

ఫిబ్రవరిలో యన్టీఆర్, కాజల్ కాంబినేషన్

యన్టీఆర్ కథానాయకుడుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తొలిసారిగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల 'తీన్ మార్' చిత్రాన్ని నిర్మించిన బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. చిత్రం షూటింగును వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించి ఏకధాటిగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందుతుందని తెలుస్తోంది. శ్రీను వైట్ల సినిమాల్లో వుండే కామెడీ ఇందులో కూడా వుండనే ఉంటుందని అంటున్నారు. కాగా, ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. 'బృందావనం' చిత్రం తర్వాత యన్టీఆర్ కాంబినేషన్లో ఆమె మళ్లీ  నటిస్తోందన్న మాట!

'శ్రీరామరాజ్యం' స్ఫూర్తితో మరో సినిమా

'శ్రీరామరాజ్యం' సినిమా బాలకృష్ణకు వృత్తిపరమైన సంతృప్తినిచ్చింది. ఈ సినిమాకు లభించిన ప్రేక్షకాదరణ ఆయనకు మంచి కిక్ ఇస్తోంది. అందుకే ముందు ముందు మరిన్ని పౌరాణికాలు చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తాను చెప్పినట్టు మంచి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా పౌరాణిక చిత్రాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు ఈ విషయంలో ఆయనను అప్రోచ్ అవుతున్నారు. అయితే, 'శ్రీరామరాజ్యం' తర్వాత మళ్లీ అంతటి స్థాయి కథ కోసం ఆయన వెయిట్ చేస్తున్నట్టు బాలకృష్ణ సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కె.రాఘవేంద్రరావు నుంచి కూడా ఓ ప్రతిపాదన వచ్చిందట. అన్నీ అనుకూలిస్తే ఆయన దర్శకత్వంలో వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఓ పౌరాణిక సినిమా సెట్స్ కి వెళ్లే అవకాశం వుంది!

ఫంక్షన్లపై కలకలం రేపిన నాగార్జున మాటలు

ఉన్నదున్నట్టు మాట్లాడే వ్యక్తిగా అక్కినేని నాగార్జునకు టాలీవుడ్ లో పేరుంది. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనసులో మాట అక్కడే వుంచేసుకోరు. మన సినిమాల షూటింగులకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదంటూ నిన్న ప్రభుత్వం మీద ఆయన విరుచుకుపడ్డ విషయం మనకు తెల్సిందే. తాజాగా సినిమా ఆడియో ఫంక్షన్ల మీద కూడా ఆయన తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తపరచారు. "ఆడియో ఫంక్షన్లలో ఏముందండీ... వీళ్లని వాళ్లు... వాళ్లని వీళ్లూ పొగుడుకోవడమే కదా? అలాంటి పొగడ్తలు నాకిష్టముండదు. అందుకే రాజన్న సినిమా ఆడియో ఫంక్షన్ చేయలేదు. పాటలు బాగుంటే అవే సక్సెస్ అవుతాయి. లేకపోతే ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా ప్రయోజనం వుండదు" అన్నారు నాగార్జున. అయితే, గతంలో నాగ్ సినిమాలకు సంబంధించిన ఆడియో వేడుకలు కూడా గ్రాండ్ గానే జరిగాయి. మరి, ఇలా ఒక్కసారిగా ఆయనకు వీటి మీద ఎందుకింత అయిష్టత ఏర్పడిందో?




0 comments:

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best Buy Coupons