Gossips

.

పవర్ స్టార్ నమ్మకం నిలబెడతానంటున్న విలన్



పవర్ స్టార్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని అంటున్నాడు ‘గబ్బర్ సింగ్’లో విలన్ గా నటిస్తున్న అభిమన్యు సింగ్. రక్త చరిత్ర సినిమాలో అతి భయంకరమైన వ్యక్తిగా నటించిన అభిమన్యు సింగ్ కి విలన్ కేటగిరీలో మంచి మార్కులే పడ్డాయి. అభిమన్యు సింగ్ క్రూరత్వంపై మనసు పడ్డ పవన్ కళ్యాణ్ ఏరి కోరి మరీ అతన్ని ఇందులో విలన్ గా పెట్టించాడు. 

తన పాత్రపై అభిమన్యు సింగ్ మాట్లాడుతూ....‘పెద్ద హీరో, భారీ బడ్డెట్ సినిమా. తాను గతంలో చేసిన దానికి మరింత పరిణితి చెంది నటించడానికి ట్రై చేస్తున్నా. హిందీలో సోనూసూద్ పోషించిన పాత్రకు ఏ మాత్రం తీసిపోకుండా నేను ఈ సినిమాలో నటిస్తున్నా’ అని తెలిపారు. 

పవన్, శృతి హాసన్ జంటగా నిటిస్తున్న ఈ చిత్రానికి హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తీన్ మార్ చిత్ర నిర్మాత గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొల్లాచ్చిలో తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఇక్కడ పలు యాక్షన్ సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణ జరిగింది. జనవరి రెండో వారం నుంచి మరొక షెడ్యూల్ మొదలు కానుంది.



డబుల్ డ్యూటీ భరిస్తూ...ప్రభాస్



ఒకప్పడు తెలుగు సినిమా హీరోలు ఒక సంవత్సరంలో నాలుగైదు సినిమాలు చేసేవారు. గత కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో పరిస్థితి చేస్తే మన యువ హీరోలు ఒక సినిమా తీయడానికి రెండు మూడు సంవత్సరాలు తీసుకున్న సందర్భాలున్నాయి. అలా చేయడం వల్ల కెరీర్ లో అతిపెద్ద దెబ్బలు తిన్న పవన్, మహేష్ లాంటి హీరోలు మళ్లీ రూటు మార్చి వరుస సినిమాలతో దూసుకెలుతున్నారు. వీరందరినీ చూసి ముందు జాగ్రత్త పడ్డాడో ఏమోగానీ ప్రభాస్ కూడా వరుస సినిమాలకు సైన్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ‘రెబల్’ సినిమా చేస్తున్న ప్రభాస్...మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో ‘వారధి’ సినిమా చేస్తున్నాడు. 

అయితే ఒక సినిమా తర్వాత ఒక సినిమా కాకుండా ఈ రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కొన్నిరోజులు వారధి షూటింగ్ జరిగితే, మరికొన్ని రోజులు రెబల్ సినిమాకు నటిస్తున్నాడట. కెరీర్ లో మంచి ఫలితాలు సాధించడం కోసం ఇలా డబల్ డ్యూటీ భరిస్తూ.... చాలా కష్ట పడుతున్నాడు. ఇటీవలే వారధి షూటింగ్ కోకాపేటలో జరుపుకోగా, ప్రస్తుతం రెబల్ షూటింగులో భాగంగా బ్యాంకాక్ వెళ్లాడు. ప్రభాస్ కష్టం ఫలించి ఈ రెండు సినిమాలు భారీ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రెబల్ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె పుల్లారావు, జె భగవాన్ నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా, దీక్షా సేథ్ లు హీరోయిన్లు. సంగీతం: తమన్, కెమెరా: రాంప్రసాద్, మాటలు: స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్. 

వారధి చిత్రానన్ని ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి కృష్ణ శ్రీనివాస్ సంయుక్తం గా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లు. కొరటాల శివ ఈ చిత్రం తో దర్శకుడి గా మారబోతున్నారు.



11 రోజుల్లో ‘పంజా’ రూ. 70 కోట్లు!



పవన్ కళ్యాణ్ పంజా మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాపై తొలి నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీ ఉన్నాయని తెలుస్తోంది. డిసెంబర్ 9న విడుదలైన ఈ సినిమా తొలి 11 రోజుల్లో రూ. 70.2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా దాదాపు 33 కోట్లతో నిర్మించారు. ఈ లెక్కన చూస్తే ఇప్పటికే రెట్టింపు లాభం వచ్చినట్లే. ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం తొలి 11 రోజుల్లో కలెక్షన్లు కింది విధంగా ఉన్నాయి. 

తొలి రోజు : రూ. 16.2 కోట్లు
2వరోజు : రూ. 9.2 కోట్టు
3వరోజు : రూ. 8.3 కోట్లు
4వరోజు : రూ. 5.9 కోట్లు
5వరోజు : రూ. 5.3 కోట్లు
6వరోజు : రూ. 4.9 కోట్లు
7వరోజు : రూ. 4.6 కోట్లు
8వరోజు : రూ. 4.3 కోట్లు
9వరోజు : రూ. 3.9కోట్లు
10వరోజు : రూ. 4.1 కోట్లు
11రోజు : రూ. 3.5 కోట్లు



టాలీవుడ్ హిట్లు-ప్లాపులు @2011



టాలీవుడ్ లో 2011 సంవత్సరంలో దాదాపు 80 తెలుగు సినిమాలు రూపొందించబడ్డాయి. చెప్పుకోవడానికి ఈ సంఖ్య పెద్దగా ఉన్నా, అందులో విజయం సాధించినవి మాత్రం వేళ్లపై లెక్క పెట్టొచ్చు. చాలా సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో తెలుగు సినిమా కలెక్షన్ల మోత మోగించిందని చెప్పవచ్చు. ప్రథమార్థం అంతా మిరపకాయ్‌, అలా మెుదలైంది, అహనా పెళ్లంట, 100% లవ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, వీర వంటి చిత్రాలు సేఫ్‌జోన్‌లో నిలబడగా ద్వితీయార్థంలో విడుదలైన ‘దూకుడు’ బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా టాప్‌ గ్రాసర్‌ చిత్రంగా నిలిచి శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. 5 సంవత్సరాలుగా హిట్స్‌తో దోబూచులాడిన మహేష్‌బాబుకు ఇండస్ట్రీ టాప్‌ గ్రాసర్‌ చిత్రాలలో ఒకటిగా ‘దూకుడు’ చిత్రం నిలిచి పోయింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రథమార్థంలో వచ్చిన ‘శక్తి’ అపజయం మిగల్చగా ద్వితీయార్థంలో వచ్చిన ‘ఊసరవెల్లి’ కలెక్షన్ల పరంగా ఊరటనిచ్చింది. బాలకృష్ణకు ప్రథమార్థంలో ‘పరమవీరచక్ర’ చేదు అనుభవాన్ని మిగిలిస్తే ద్వితీయార్థం వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ చిత్రం కొత్త ఊపునిచ్చింది. అల్లు అర్జున్‌ నటించిన బధ్రీనాధ్‌ ఈ సంవత్సరం అంచనాలను అందుకోలేకపోయింది. ఓవరాల్‌గా యావరేజ్‌గా నిలిచింది. రవితేజకు మిరపకాయ్‌ హిట్‌గా నిలిస్తే ‘వీర’ సినిమా యావరేజ్‌గా పోయింది. 

నాగార్జునకు గగనం సినిమా ఎబో యావరేజ్ సినిమా నిలిచింది. రగడ్ సినిమా యావరేజ్ గా నిలిచింది. తాజాగా విడుదలైన రాజన్న ఫర్వాలేదనే టాక్ తో ముందుకు సాగుతోంది. రాజన్న సినిమా పూర్తి ఫలితం తేలాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్, పంజా చిత్రాలు యావరేజ్ చిత్రాలు పేరు తెచ్చుకున్నాయి. నాగ చైతన్యకు 100%లవ్ హిట్టిస్తే...దడ, బెజవాడ సినిమాలు ప్లాపుగా నిలిచాయి. 

వరుణ్‌సందేశ్‌ నటించిన కుదిరితే ఓ కప్పు కాఫీ, బ్రహ్మిగాడి కథ, ప్రియుడు చిత్రాలు మూడు బిలో యావరేజ్‌గా పేరు తెచ్చుకున్నాయి. నానీ నటించిన అలా మొదలైంది సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. పిల్ల జమిందార్‌ ఎబోవ్‌ యావరేజ్‌ హిట్‌గా నిలిచింది. సెగ ఫ్లాపయ్యింది. సునీల్‌ నటించిన కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం అప్పల్రాజు దొంగలబండి చిత్రాలు ఫ్లాపయ్యాయి. కృష్ణుడు నటించిన వైకుంఠపాళి, నాకు ఓ లవరు ఉంది చిత్రాలు రెండూ ఫ్లాపయ్యాయి. నిఖిల్‌ నటించిన వీడు తేడా 4వారాలు దాటి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

అల్లరి నరేష్‌ ఎప్పటిలానే తన హవా నిలబెట్టుకున్నాడు. అహనాపెళ్లంట, సీమటపాకాయ్‌ చిత్రాలు హిట్‌ చిత్రాలుగా వసూళ్ల పంట పండిస్తే మడతకాజా, సంఘర్షణ డబ్బింగ్‌ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ఇక హీరో రామ్‌ నటించిన కందిరీగ హిట్టయి కలెక్షన్లు కురిపించింది. సుమంత్‌కి గోల్కొండ హైస్కూల్‌ యావరేజ్‌గా టాక్‌ తెచ్చుకుంటే దగ్గరగా-దూరంగా, రాజ్ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. విష్ణు నటించిన ‘వస్తాడు నా రాజు’ ఫ్లాప్‌ అయ్యింది. జగపతిబాబు నటించిన చట్టం, నగరం నిద్రపోతున్న వేళ చిత్రాలు రెండూ అపజయం పాలయ్యాయి. శ్రీకాంత్‌కు శ్రీరామరాజ్యం హిట్టు దక్కినా అది బాలకృష్ణ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక విరోధి, దుశ్శాసన చిత్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రానా నటించిన నేను నా రాక్షసి ఫ్లాపయింది. గోపీచంద్‌ నటించిన వాంటెడ్, మొగుడు చిత్రాలు రెండూ పరాజయం పాలయ్యాయి. సిద్దార్థ నటించిన అనగనగా ఓ ధీరుడు, 180 చిత్రాలు ఫ్లాపవ్వగా ఓ మై ఫ్రెండ్‌ యావరేజ్‌గా నిలిచింది. నారా రోహిత్‌ నటించిన ‘సోలో’ ఎబోవ్‌ యావరేజ్‌ చిత్రంగా పేరుతెచ్చుకుంది.

సూర్య, రవితేజ 3డి చిత్రం డిటైల్స్



సూర్య, రవితేజ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. దీనిని ఓ భారీ 3డి సినిమా రూపొందించడానికి దర్శకుడు వెంకట్ ప్రభు స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సందర్భంగా వెంకట్ ప్రభు మాట్లాడుతూ ‘ హీరో సూర్యకు లైన్ చెప్పాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే పనిలో వున్నాను. హిందీ చిత్రం ‘రా. వన్’ చిత్రం కోసం షారుక్ ఖాన్‌పై సన్నివేశాలను డిజిటల్ ఫార్మెట్‌లో చిత్రీకరించిన ఆ తర్వాత వాటిని 3డి ఫార్మెట్‌లోకి మార్చారు. కానీ నేను దర్శకత్వం వహించే ఈ చిత్రం కోసం నేరుగా ప్రతి సన్నివేశాన్ని 3డి ఫార్మెట్‌లోనే చిత్రీకరించాలనుకుంటున్నాను. దీని కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులని సంప్రదిస్తున్నాం’ అని తెలిపారు. 

ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ఫైనల్ కానున్నాయి. 2012 జూన్ తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. 

ప్రస్తుతం రవితేజ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నిప్పు’ చిత్రంలో బిజీగా గడుపుతున్నాడు. రవితేజ సరసన దీక్షా సేథ్ నటిస్తోంది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది.



సంక్రాంతి పోటీ ఈ ముగ్గరు మధ్యనే



ఈ సారి సంక్రాంతిని తెలుగు సినిమా ప్రియులు యాక్షన్ సంక్రాంతికి గా జరుపుకోనున్నారు. దానికి కారణం సంక్రాంతికి విడుదల అయ్యే మూడు పెద్ద చిత్రాలు యాక్షన్ సినిమాలు కావటమే. అన్నింటికన్నా ముందుగా మహేష్‌బాబు నటించిన ‘ది బిజినెస్‌మేన్‌’ రానుంది. పూరీజగన్నాధ్‌ ఈ చిత్రాన్ని తనకు, మహేష్‌కు ఉన్న మాస్‌ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన ప్రోమోలు,ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంతటా క్రేజ్ సంపాదించాయి. ఈ చిత్రంలో డైలాగ్స్ ఎక్కడ విన్నా అవే వినపడుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పోకిరి వంటి హిట్ రావటంతో ఈ సినిమా అదే రేంజ్ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇక వెంకటేష్‌ విషయానికి వస్తే.. చాలా కాలం గ్యాప్‌ తీసుకుని యాక్షన్‌,సెంటిమెంట్‌ కలగలిపిన సినిమా బాడీగార్డ్ తో 2012లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ‘బాడీగార్డ్‌’ పాటలు హిట్టయి ఇప్పటికే మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ చిత్రం మళయాళంలో సూపర్ హిట్టైన బాడీగార్డ్ కు రీమేక్ కావటంతో ఈ చిత్రంపై అన్ని వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేని గతంలో డాన్ శీను వంటి హిట్ చిత్రం అందించి ఉన్నారు. కామిడీ,సెంటిమెంట్ మిక్స్ చేసిన ఈ బాడీగార్డ్ సంక్రాంతికి విజేతగా నిలుస్తుందని బావిస్తున్నారు. ఇక మూడో చిత్రం రవితేజ తాజా చిత్రం నిప్పు. ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ అందించిన గుణశేఖర్ దర్శకత్వంలో మరో ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. రవితేజ, దర్శకుడు గుణశేఖర్‌ల కలయికలో వైవిఎస్‌ చౌదరి నిర్మించిన ‘నిప్పు’ కూడా సంక్రాంతి బరిలో నిలవనుంది. 2012 మాత్రం విడుదలయ్యే సినిమాలు మూడూ కూడా మాస్‌ కథాంశంతో యాక్షన్‌ ధమకా మోగించనున్నాయి. పండుగకు వస్తున్న ఈ మూడు యాక్షన్‌ ధమాకా చిత్రాలు ఎంతవరకూ బాక్సాఫీస్‌ కలెక్షన్లను కొల్లగొడతాయో కొద్ది రోజుల్లో తేలిపోనుంది.



మతి పోగొడుతున్న రతి నిర్వేదం ఆంటీ



శ్వేతా మీనన్. మలయాళ హాట్ ఆంటీ. ఈవిడ నటించిన రతినిర్వేదం సినిమా ప్రస్తుతం తెలుగులోనూ విడుదలైన శృంగార ప్రేమికులను అలరిస్తోంది. వయసు పైబడిన మహిళ, తనకంటే చిన్న వాడైన కుర్రాడి మధ్య ప్రేమ కాని ప్రేమ, బంధం కానీ ‘సం’బంధం, ఉరకలెత్తే యవ్వన కోరికలు...తదితర అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.

పెద్దలకు మాత్రమే పరిమితం అయిన ఈ సినిమాకు పెద్దల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. నాగార్జున రాజన్న సినిమాలోనూ శ్వేత మీనన్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే...ఈ ఆంటీకి సంబంధిచిన ఓ ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తోంది. పక్క ఫోటో చూశారుగా. అదన్నమాట మ్యాటర్.



సినీ తారల కల్యాణ వైభోగం @ 2011



తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓకే ఏడాది చాలా మంది స్టార్స్ ఓ ఇంటి వారయ్యారు. తెలుగునాటే కాదు, సౌతిండియాలోని ఇతర సినీ రంగాలకు చెందిన తారల వివాహాలు కూడా ఈ ఏడాదే జరిగాయి. టాలీవుడ్ టాప్ యువ స్టార్లు జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వివాహాలు ఈ ఏడేది జరుగగా...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నిశ్చితార్థం కూడా పూర్తయింది.

అల్లు అర్జున్ తన స్నేహితురాలు స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వీళ్ల పెళ్లికి తొలుత కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యాయనే వార్తలు వినిపించినప్పటికీ...చివరకు ఇరు కుటుంబాల వారి పెద్దల అంగీకారంతో మార్చి 6న అంగరంగ వైభవంగా వీరిద్దరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. 

ఇక జూనియర్ ఎన్టీఆర్ తన బంధువుల అమ్మాయి లక్ష్మిప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ నందమూరి చిన్నోడి పెళ్లి అభిమానులు కలకాలం గుర్తుంచుకునేలా మే6న భారీ వేడుకగా జరిగింది. 

రామ్ చరణ్ తేజ్, ఉపాసన కామినేని పెళ్లి కూడా ఈ సంవత్సరమే ఖరారైంది. డిసెంబర్ 1న నిశ్చితార్థం కూడా పూర్తయింది. వచ్చే ఏడాది వీరి పిళ్లి జరిగే అవకాశం ఉంది. 

తెలుగులో పలు సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్ర కు చెందిన రాజకీయ నాయకుడు రవి రాణాను పెళ్లాడింది. మలయాళం సూపర్ స్టార్ పృథ్వి రాజ్ వివాహం సుప్రియతో ఏప్రిల్ 25న జరిగింది. 

రతి నిర్వేదం సినిమాలో హీరోయిన్, రాజన్న సినిమాలో దొరసాని పాత్ర పోషించిన శ్వేతమీనన్ తన బాయ్ ఫ్రెండ్ శ్రీవాల్సన్ జె మీనన్ ను జూన్ 18న వివాహమాడింది. 

అదే విధంగా యుగానికొక్కడు సినిమా ద్వారా మనకు సుపరిచితం అయిన కార్తీ వివాహం పెద్దలు ఎంపిక చేసిన రంజీని అనే అమ్మాయితో జరిగింది. అదే విధంగా తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తన గర్ల్ ఫ్రెండ్ గీతాంజలిని పెళ్లి చేసుకున్నాడు.



బ్యాంకాక్‌‌లో రెబల్ షూటింగ్... ప్రభాస్ గొడవ!



యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ‘రెబల్’ సినిమా చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన ప్రభాస్ విలన్లతో గొడవ పడే సన్నివేశాల నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీన్లు పూర్తయిన వెంటనే పాటల చిత్రీకరణ జరుగనుంది. 

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాఘవ లారెన్స్. ఇటీవల కాలంలో పలు హిట్ చిత్రాలతో దూసుకెలుతున్న లారెన్స్ ఈ చిత్రం ద్వారా అగ్రదర్శకుల సరసన చేయాలని ఉవ్విల్లూరుతున్నాడు. అందుకే ప్రభాస్ ను న్యూ లుక్ తో చూపించే ప్రయత్నం చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు.

ఈ చిత్రన్ని శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె పుల్లారావు, జె భగవాన్ నిర్మిస్తున్నారు. వరుస హిట్లతో మంచి పేరు తెచ్చుకున్న తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాంప్రసాద్, మాటలు: స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్.



2011 సంవత్సరంలో టాలీవుడ్ వివాదాలు



మరికొన్ని రోజుల్లో 2011 సంవత్సరం అంతమై..2012వ సంవత్సరం రాబోతోంది. ఈనేపథ్యంలో ఈ సంవత్సరంలో టాలీవుడ్ వివాదాపై ఓసారి లుక్కేద్దాం.

రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఓసంచలనం సృష్టించింది. సీమ ఫ్యాక్షన్ గొడవల యదార్ధ ఘటనల ఆదారంగా రూపొందిన ఈ సినిమాలో..నిజ జీవితంలో పరిటాల రవి, మద్దెలచెర్వు సూరి మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్ ను సినిమా రూపంలో తెరకెక్కించారు. పరిటాల రవి పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించగా, మద్దెల చెర్వు సూరి పాత్రను హీరో సూర్య పోషించారు. ఈ సినిమా విడుదలై కొన్ని రోజులకే సూరి హైదరాబాద్ నడి ఒడ్డున జనవరి 3న హత్యకు గురయ్యాడు. 

ఆ తర్వాత చెప్పకోదగ్గది టాలీవుడ్ డ్రగ్ రాకెట్! పలువురు నిర్మాతలకు, నటులకు మాదక ద్రవ్యాల కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించడమే కాదు, పలువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కూడా. రవితేజ సోదరుడు రఘుబాబు, భరత్ లు డ్రగ్స్ కొంటూ పట్టబడగా, ఓ ఇద్దరు నిర్మాతలు డ్రగ్స్ అమ్ముతూ పట్టబడ్డారు. నటి జీవిత సోదరుడు కూడా ఈకేసులో పోలీసులకు చిక్కాడు. ఇక హీరో వరుణ్ సందేష్ కు డ్రగ్స్ కేసులో సంబంధం, అతనికి మత్తు పదార్ధాలు వాడే అలవాటు ఉన్నట్లు వచ్చిన వార్తలు ఆ మధ్య సర్వత్రా చర్చనీయాంశం అయింది. 

మగధీర చిత్రం ద్వారా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ సంవత్సరం. అమ్మడు అక్కడ అడుగు పెట్టిన కొన్ని రోజులకే ఎఫ్ హెచ్ఎం పురుషుల మ్యాగజైన్ పై టాప్ లెస్ గా దర్శనం ఇచ్చింది. కాజల్ చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ అవకాశాల కోసం బరితెగించిందని దుమ్మెత్తి పోసినవాళ్లూ ఉన్నారు. అయితే కాజల్ మాత్రం అది నాఫోటోకాదు మార్ఫింగ్ అంటూ ఓ ప్రకటన చేసి ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ వారు మాత్రం ఇది రియల్ ఫోటో అంటూ ట్విస్ట్ ఇవ్వడం కొసమెరుపు.

ఇక... వాన, బంగారం చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా హత్య కేసులో ఇరుక్కుంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి అతని భార్యను చంపిందనే ఆరోపణలు ఉన్నాయి. 

ఇటీవల మరణించి ప్రముఖ నిర్మాత, రచయిత ఎంఎస్ రెడ్డి రాసిన తన ఆత్మకథ పుస్తకం‘ఇది నా కథ’. ఈ పుస్తకంలో సీనియర్ ఎన్టీఆర్ పిసినారితనం గురించి, జూనియర్ ఎన్టీఆర్ అహంభావం, చిరంజీవి మూలంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, గుణశేఖర్ గుణవంతుడు కాడనే విషయాలు వెల్లడించి సంచలనం సృష్టించారు.

ఆ మధ్య రామ్ చరణ్ తేజ్ దాసరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం సృష్టించాయి. నిర్మాతలకు, కార్మికులకు మధ్య ఏర్పడ్డ విబేధాలతో కొంత కాలం సినిమా షూటింగులు ఆగి పోయాయి. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పలు సినిమా షూటింగులపై దాడులు గట్రా జరిగాయి. ఎన్నడూలేని విధంగా ఈ సంవత్సరం నందమూరి, మెగా కుటుంబాల హీరోల అభిమానుల వివాదాలు రచ్చకెక్కాయి.

0 comments:

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best Buy Coupons